పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం,డిప్యూటీ సీఎం

pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi pm modi welcomed by Andhra Pradesh leaders at puttaparthi

పుట్టపర్తికి చేరుకున్న ప్రధాని మోదీ..ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.పుట్టపర్తిలో శ్రీసత్యసాయి బాబా శత జయంతి వేడుకలు అట్టహాసంగా  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ  పుట్టపర్తికి చేరుకున్నారు.

విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ ప్రశాంతి నిలయానికి వెళ్లి సత్యసాయి బాబా మందిరాన్ని, మహాసమాధిని దర్శించి నివాళులు అర్పించారు.

శత జయంతి సందర్భంగా రూపొందించిన బాబా స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపుల విడుదలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్ది సేపట్లో ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్మారక చిహ్నాలను అధికారికంగా విడుదల చేయనున్నారు. పుట్టపర్తిలో భారీ భద్రత మధ్య ఈ వేడుకలు నిర్వహించబడుతున్నాయి.

also read:CV Anand Reaction on Piracy:ఐ బొమ్మ కాకపోతే..మరో బొమ్మ వస్తుంది 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *