ఐ బొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలి…ఫైర్ అయిన నిర్మాత
TG: iBomma నిర్వాహకుడు రవిపై ఎన్‌కౌంటర్ చేయాలంటూ ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ఛాంబర్(telugu film chamber) ప్రతినిధి సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైరసీ కారణంగా తెలుగు సినిమా పరిశ్రమ అనేక కోట్లు నష్టపోతుందని, ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటేనే భయం కలుగుతుందని ఆయన అన్నారు.
“నేను ఎంతో కడుపుమంటతో, ఆవేదనతో ఈ మాటలు చెబుతున్నాను. పరిశ్రమకు నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పనిసరి” అని స్పష్టం చేశారు.
ALSO READ:Jagan CBI Court :రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్
అదే సమయంలో, iBomma కేసులో నిందితుడిని పట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని, దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ అభినందనలకు అర్హమని చెప్పారు. పైరసీపై ఇంతటి కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ఈ సమస్య పూర్తిగా తగ్గదని సి. కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
