Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత 

Police seize MDM drug packets and arrest six individuals in Guntur Police seize MDM drug packets and arrest six individuals in Guntur

గుంటూరు జిల్లా : ఓల్డ్ గుంటూరు పరిసర ప్రాంతాలలో నిషేధిత MDM మత్తు పదార్థాలు వాడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు.రాబడిన సమాచారం మేరకు బుడంపాడు బైపాస్, అన్నపూర్ణ కాంప్లెక్స్ వెనుక సంచరిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల MDM మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.

అరెస్ట్ చేసిన ఆళ్ల అనిల్, చింతల శ్రవణ్‌చంద్ర నగరంలో మత్తు పదార్థాలు వాడటమే కాకుండా కొంతమందికి విక్రయం చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. విచారణలో వారు బెంగళూరు నుంచి ₹34,500 విలువైన డ్రగ్స్‌ను గుంటూరుకు తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు.


ALSO READ:Sheikh Hasina:బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు మరణశిక్ష

అరెస్టు చేసిన ఆరుగురిలో ముగ్గురిపై ఇదివరకే గుంటూరులోని పలు పోలీస్ స్టేషన్లలో డ్రగ్స్ విక్రయం మరియు వినియోగం కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్య కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించేందుకు ముమ్మర చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టి, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతున్నామని హెచ్చరించారు. యువత మత్తు బారిన పడకుండా త్వరలో కాలేజీలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *