తెలంగాణలో పది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం కీలక విచారణ జరిపింది.ఈ కేసులో స్పీకర్ నిర్ణయం ఎందుకు ఆలస్యమవుతుంది అనే నేపథ్యంలో, సుప్రీంకోర్టు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేసింది. ఈ వ్యవధిలో నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అగ్రహం వ్యక్తం చేసింది.ఈ కేసు సంబంధించిన తదుపరి విచారణను కూడా న్యాయస్థానం నాలుగు వారాలకు గడువు విధించింది.
తెలంగాణలో పదిమంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మూడు వేర్వేరు పిటిషన్లు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. జూలై 31న కోర్టు, ఈ పిటిషన్లపై స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
అయితే ఆ గడువు పూర్తి కావడంతో, స్పీకర్‌కు అదనంగా రెండు నెలల సమయం ఇవ్వాలని కోరుతూ తెలంగాణ శాసనసభ కార్యదర్శి దాఖలు చేసిన అప్లికేషన్ ఈరోజు విచారణకు వచ్చింది.
ALSO READ:Mulugu 100ml Milk Scheme: సీతక్క చేతులమీదుగా అంగన్వాడి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం
ఇక మరో వైపు, స్పీకర్ కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని ఆరోపిస్తూ కేటీఆర్ దాఖలు చేసిన ధిక్కరణ పిటిషన్ కూడా లిస్ట్‌లో ఉంది. అలాగే నేరుగా న్యాయస్థానే నిర్ణయం ఇవ్వాలని కోరుతూ కేటీఆర్ పెట్టిన రిట్ పిటిషన్‌పై కూడా ధర్మాసనం స్పందించింది.
అన్ని వివరాలను పరిశీలించిన అనంతరం, సుప్రీంకోర్టు స్పీకర్‌కు కొత్తగా నాలుగు వారాల గడువు ఇచ్చి కేసును వాయిదా వేసింది.
