Battili Ganja Seizure:పార్వతీపురం మన్యం జిల్లాలో గంజాయి కలకలం బత్తిలి వద్ద గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కేరళ నుంచి ఒడిశాకు తరలిస్తున్న ఈ గంజాయి రాకెట్(Ganja Rocket)పై పక్కా సమాచారం మేరకు పాలకొండ డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలోని బృందం దాడి నిర్వహించింది.
పోలీసులు వివరాల ప్రకారం, పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు.
ALSO READ:Crow Incident Fire:కాకి చేసిన పనికి కాలిబూడిదైన నాలుగు ఇళ్లు
రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా(AP Ganja Free Mission) మార్చేందుకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా ఇటువంటి అక్రమ రవాణాపై కఠిన నిఘా ఉంటుందని డీఎస్పీ రాంబాబు వెల్లడించారు.
ఈ ఆపరేషన్‌లో పాలకొండ సీఐ, బత్తిలి ఎస్సైతో కూడిన బృందం పాల్గొంది. గంజాయి రవాణా పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు పలు రూట్లపై కఠిన తనిఖీలు కొనసాగిస్తున్నారు.
