Bandi Sanjay Fires:తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీ దే అవుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. జూబ్లీహిల్స్లో మైనార్టీల ఓట్లను కాంగ్రెస్ ఏకం చేసిందని, ఇకపై తాము తెలంగాణలో హిందువులందరినీ ఏకం చేసి BJP ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని HYDలో మీడియాతో మాట్లాడారు.
జూబ్లీహిల్స్లో ఓట్ల చోరీ జరగలేదా అని కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ వంటి సిట్టింగ్ స్థానాల్లో BRS ఓడిపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి గుండెసున్నా రావడం వంటి అంశాలపై కూడా సంజయ్ స్పందించారు.
ప్రతిపక్షమే ఎలా అవుతుందో KTR స్పష్టత ఇవ్వాలని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, BRSపై BJP దాడులు వేగం పెంచిన నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ALSO READ:SBI Chairman on Bank Mergers: బ్యాంకుల విలీనాలు దేశానికి మంచిదే
