iBomma Founder Arrested:iBomma నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్‌

iBomma administrator Ravi arrested by CCS police in Hyderabad iBomma administrator Ravi arrested by CCS police in Hyderabad

ఎట్టకేలకు దొరికిన పైరసీ వెబ్‌సైట్ “iBomma” నిర్వాహకుడు”ఇమ్మడి రవి” అరెస్ట్ అయ్యాడు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని కూకట్‌పల్లి ప్రాంతంలో సీసీఎస్ పోలీసులు(CCS Police)అదుపులోకి తీసుకున్నారు.

రవి కరీబియన్ దీవుల్లో తిరుగుతూ అక్కడ నుంచే iBomma కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.

సినిమాలు థియేటర్లలో విడుదలైన రోజే పైరసీ(Piracy Case) చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల పలువురు నిర్మాతలు, డిజిటల్ హక్కుల సంస్థలు పలు మార్లు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి రవిని ట్రాప్‌ చేశారు.

పైరసీ కారణంగా చిత్ర పరిశ్రమకు భారీ నష్టం జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఈ కేసును కీలకంగా పరిగణిస్తోంది. రవిని రిమాండుకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది.

ALSO READ:NDA Bihar Election Lead 2025: ఎన్డీఏ సెంచరీ.. 100+ సీట్లలో లీడ్ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *