CII Summit Visakhapatnam | విశాఖలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులే  లక్ష్యం 

CII Partnership Summit 2025 inaugurated in Visakhapatnam with massive investment targets. CII Partnership Summit 2025 inaugurated in Visakhapatnam with massive investment targets.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా కీలక అడుగుగా భావిస్తున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నం(CII Partnership Summit Visakhapatnam )లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సమ్మిట్‌ను లాంఛనంగా ఆరంభించారు.

ఈ సదస్సు ద్వారా సుమారు రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం. ప్రారంభానికి ముందే రూ. 3.65 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదరడం రాష్ట్రంలో ఆశావాహ వాతావరణాన్ని సృష్టించింది.

ALSO READ:Jubilee Hills Counting Tragedy | ఫలితాల ఉద్విగ్నంలో అభ్యర్థి అన్వర్ అనూహ్య మృ*తి

50కి పైగా దేశాల నుంచి మంత్రులు, పారిశ్రామికవేత్తలు, సీఎక్స్ఓలు సహా సుమారు 3,000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు 45 సెషన్లలో వాణిజ్యం, టెక్నాలజీ, పారిశ్రామిక అభివృద్ధి, వాతావరణ మార్పులు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

సీఎం చంద్రబాబు డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించగా, ‘‘AI for Viksit Bharat’’ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు. పారిశ్రామిక వేత్తలతో సీఎం, మంత్రి నారా లోకేశ్ వరుస భేటీలు నిర్వహిస్తూ పెట్టుబడి అవకాశాలను వివరించారు.

ఇదే సందర్భంగా విజయవాడ–సింగపూర్ నేర విమాన సర్వీసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఒప్పందం కుదుర్చుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *