Telangana SSC Class 10th Exam 2026: విద్యాశాఖ కీలక ప్రకటన పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఎప్పుడంటే ?

Telangana SSC Class 10th Exam 2026 Schedule Announcement Telangana SSC Class 10th Exam 2026 Schedule Announcement

Telangana SSC Class 10th Exam 2026:తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి (SSC) పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ముఖ్య ప్రకటన వెలువడింది. విద్యాశాఖ తాజా ప్రకారం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది “మార్చి 18, 2026” నుంచి ప్రారంభమవనున్నాయి.

ఈ షెడ్యూల్‌ ప్రతిపాదనను విద్యాశాఖ ఇప్పటికే ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే అధికారిక టైమ్‌టేబుల్ విడుదల కానుంది.

అదే సమయంలో, “ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 18న ముగియనున్నాయి“, అంటే టెన్త్‌ పరీక్షలు వెంటనే ప్రారంభమవుతాయి. మధ్యలో “శ్రీరామనవమి పండుగ” (మార్చి 26 లేదా 27) సెలవు రానుంది. ఈ తేదీలపై స్పష్టత ప్రభుత్వం విడుదల చేసే సెలవు జియో తర్వాత తెలుస్తుంది.

ఇక, పదో తరగతి పూర్తి షెడ్యూల్‌ నేడో, రేపో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. పరీక్ష ఫీజు చెల్లింపులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.నవంబర్ 13 వరకు ఆలస్య రుసుము లేకుండా చెల్లించవచ్చు. అయితే, వెబ్‌సైట్ సమస్యల కారణంగా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థుల కోసం గడువును మరిన్ని 10 రోజులు పొడగించాలంటూ టీజీహెచ్‌ఎంఏ ప్రభుత్వం వద్ద విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *