నాయుడుపేట:-రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలైన సంఘటన తిరుపతి జిల్లా నాయుడుపేట(Naidupeta bike accident) శ్రీకాళహస్తి బైపాస్ రోడ్ లోని అవని అపార్ట్మెంట్ వద్ద గురువారం ఉదయం చోటు చేసుకుంది.
ALSO READ:పేలుడు తర్వాత అదృశ్యమైన మరో కశ్మీరీ డాక్టర్ | Kashmiri doctor missing after Delhi blast
అవని అపార్ట్మెంట్ ఎదురుగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతున్న ఒక వ్యక్తి చూసుకోకుండా మోటార్ సైకిల్ పై రోడ్డు దాటుతున్న సమయంలో నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి తాల్వాయిపాడు వైపు వెళుతున్న ఇద్దరు యువకులు బైక్ పై అతివేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో హోటల్ యజమానికి తలకి కాలుకి తీవ్ర గాయాలయ్యాయి యువకులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.చుట్టుపక్కల ఉన్న వారు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో, గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
