పవన్ కళ్యాణ్ జోక్యం కోరిన పిఠాపురం రైతులు:కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మండలం వెల్దుర్తి గ్రామ ప్రజలు, రైతులు గత 12 సంవత్సరాలుగా పూర్తికాకపోయిన బ్రిడ్జి పనులపై ఆవేదన వ్యక్తం చేస్తూ “గోడు వినండి మహాప్రభూ” అంటూ నిరాహార దీక్ష చేపట్టారు.
బ్రిడ్జి పనులు నిలిచిపోయిన కారణంగా దొంతమూరు, వెల్దుర్తి సహా పది గ్రామాల ప్రజలకు రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయని వారు వాపోయారు.
రైతులు పేర్కొంటూ, “మేము పండించిన ధాన్యం ఇతర గ్రామాలకు తీసుకెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వర్షాకాలంలో మరింత కష్టాలు ఎదుర్కొంటున్నాం” అని తెలిపారు.
ALSO READ:భారత్ సరిహద్దుల్లో ఉగ్రవాద విస్తరణకు పాక్ కొత్త కుట్రలు
గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా తమ సమస్య పరిష్కారం కాలేదని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి “మీ ద్వారా మా గోడు వినిపించాలని, బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలని ఆశిస్తున్నాం” అని రైతులు కోరారు. నిరాహార దీక్షలో పలు గ్రామాల ప్రజలు పాల్గొని, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
