కాకినాడ ఆటోనగర్‌ ప్లాట్లపై దేవాదాయశాఖ ఇబ్బందులు – ప్లాట్ల యజమానుల ఆవేదన

కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, మెకానిక్ షెడ్లను తరలించేందుకు నాటి ప్రభుత్వం 1993లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (APIIC) ద్వారా సర్పవరంలో 18 ఎకరాల భూమి సేకరించింది. అనంతరం 2000లో ఏపీఐఐసీ నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన వారే ఆటోనగర్‌ను ఏర్పరచుకున్నారు. వాహనాల మరమ్మత్తు షెడ్లు, స్పేర్ పార్టుల దుకాణాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పడి వందలాది కుటుంబాలు జీవనోపాధి సాగించాయి.

అయితే, ఈ స్థిరాస్తులపై 2016లో పెద్ద సమస్య తలెత్తింది. దాదాపు 7.62 ఎకరాల భూమిని దేవాదాయశాఖ 22–A నిషేధిత జాబితాలో చేర్చడంతో, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్లాట్ల అమ్మకాలు ఆగిపోవడంతో పాటు, బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు పొందే అవకాశమూ లేకుండా పోయింది. స్థలాలు ఉన్నా, వాటి విలువ ఉపయోగం కాని స్థితిలో పడిపోవడంతో యజమానులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు మూలం సర్వే నంబర్ల గందరగోళమే. రెవెన్యూ శాఖ భూమిని సర్వే నంబరు 104/2గా నమోదు చేయగా, ఏపీఐఐసీ ఆటోనగర్‌ యజమానులకు అమ్మినప్పుడు మాత్రం 104–పార్ట్గా రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో ఈ భూమి సర్వే నంబరు 104లో భాగమని, ఇది దేవాదాయశాఖ నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పడంతో వివాదం మొదలైంది. ఫలితంగా ఈ ప్లాట్లు ఏ విధంగానూ చలామణీ కాని స్థితిలో పడిపోయాయి.

ప్రస్తుతం 7.62 ఎకరాల్లో సుమారు 60 మంది మెకానిక్ షెడ్లు, వాహనాల స్పేర్ పార్టులు, చిన్న పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారం సరిగా సాగకపోవడం, ఆస్తులపై హక్కు నిర్ధారణ లేకపోవడం వల్ల ఆర్థికంగా కుదేలవుతున్నారు.

ఈ వివాదానికి మరో కారణం సర్పవరం భావనారాయణస్వామి ఆలయానికి చెందిన భూములు కావడం. సర్వే నంబరు 104లో 8.05 ఎకరాలు, 122లో 5.5 ఎకరాలు, 105/4లో 0.38 ఎకరాలు ఆలయ భూములుగా నమోదు కావడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. ఆలయ భూములే కాబట్టి దేవాదాయశాఖ జాబితాలో ఉండాలని అధికారులు చెబుతున్నారు.

“మాకు ఇచ్చిన ప్లాట్లను 2016లో దేవాదాయశాఖ నిషేధిత జాబితాలో చేర్చేశారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. బ్యాంకు రుణాలు రావడం లేదు. వ్యాపారం సరిగా లేక ప్లాట్లను అమ్ముదామన్నా కొనేవారు లేరు. మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదు” అని ప్లాట్ల యజమాని పెమ్మాడి శ్రీనివాసకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థలాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి కారణంగా ప్లాట్ల యజమానులు పేదరికంలోనే మిగిలిపోతున్నారు. APIIC ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినా, దేవాదాయశాఖ జాబితాలో ఉన్నాయనే కారణంతో ఇరుక్కుపోవడం అన్యాయం అని వారు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్లను మళ్లీ ప్రారంభించాలని, లేదంటే ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించకపోతే ఆటోనగర్‌లో జీవనోపాధి సాగిస్తున్న వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాకినాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు పెరుగుతుండటంతో, మెకానిక్ షెడ్లను తరలించేందుకు నాటి ప్రభుత్వం 1993లో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (APIIC) ద్వారా సర్పవరంలో 18 ఎకరాల భూమి సేకరించింది. అనంతరం 2000లో ఏపీఐఐసీ నుండి ప్లాట్లు కొనుగోలు చేసిన వారే ఆటోనగర్‌ను ఏర్పరచుకున్నారు. వాహనాల మరమ్మత్తు షెడ్లు, స్పేర్ పార్టుల దుకాణాలు, చిన్నపాటి పరిశ్రమలు ఏర్పడి వందలాది కుటుంబాలు జీవనోపాధి సాగించాయి.

అయితే, ఈ స్థిరాస్తులపై 2016లో పెద్ద సమస్య తలెత్తింది. దాదాపు 7.62 ఎకరాల భూమిని దేవాదాయశాఖ 22–A నిషేధిత జాబితాలో చేర్చడంతో, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్లాట్ల అమ్మకాలు ఆగిపోవడంతో పాటు, బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి రుణాలు పొందే అవకాశమూ లేకుండా పోయింది. స్థలాలు ఉన్నా, వాటి విలువ ఉపయోగం కాని స్థితిలో పడిపోవడంతో యజమానులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు మూలం సర్వే నంబర్ల గందరగోళమే. రెవెన్యూ శాఖ భూమిని సర్వే నంబరు 104/2గా నమోదు చేయగా, ఏపీఐఐసీ ఆటోనగర్‌ యజమానులకు అమ్మినప్పుడు మాత్రం 104–పార్ట్గా రిజిస్ట్రేషన్ చేసింది. దీంతో ఈ భూమి సర్వే నంబరు 104లో భాగమని, ఇది దేవాదాయశాఖ నిషేధిత జాబితాలో ఉందని అధికారులు చెప్పడంతో వివాదం మొదలైంది. ఫలితంగా ఈ ప్లాట్లు ఏ విధంగానూ చలామణీ కాని స్థితిలో పడిపోయాయి.

ప్రస్తుతం 7.62 ఎకరాల్లో సుమారు 60 మంది మెకానిక్ షెడ్లు, వాహనాల స్పేర్ పార్టులు, చిన్న పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారం సరిగా సాగకపోవడం, ఆస్తులపై హక్కు నిర్ధారణ లేకపోవడం వల్ల ఆర్థికంగా కుదేలవుతున్నారు.

ఈ వివాదానికి మరో కారణం సర్పవరం భావనారాయణస్వామి ఆలయానికి చెందిన భూములు కావడం. సర్వే నంబరు 104లో 8.05 ఎకరాలు, 122లో 5.5 ఎకరాలు, 105/4లో 0.38 ఎకరాలు ఆలయ భూములుగా నమోదు కావడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. ఆలయ భూములే కాబట్టి దేవాదాయశాఖ జాబితాలో ఉండాలని అధికారులు చెబుతున్నారు.

“మాకు ఇచ్చిన ప్లాట్లను 2016లో దేవాదాయశాఖ నిషేధిత జాబితాలో చేర్చేశారు. రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. బ్యాంకు రుణాలు రావడం లేదు. వ్యాపారం సరిగా లేక ప్లాట్లను అమ్ముదామన్నా కొనేవారు లేరు. మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి ఫలితం లేదు” అని ప్లాట్ల యజమాని పెమ్మాడి శ్రీనివాసకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థలాలు ఉన్నా వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి కారణంగా ప్లాట్ల యజమానులు పేదరికంలోనే మిగిలిపోతున్నారు. APIIC ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినా, దేవాదాయశాఖ జాబితాలో ఉన్నాయనే కారణంతో ఇరుక్కుపోవడం అన్యాయం అని వారు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించి రిజిస్ట్రేషన్లను మళ్లీ ప్రారంభించాలని, లేదంటే ప్రత్యామ్నాయ భూములు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఈ సమస్యకు స్పష్టమైన పరిష్కారం లభించకపోతే ఆటోనగర్‌లో జీవనోపాధి సాగిస్తున్న వందలాది కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతాయని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *