భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. గబ్బర్‌గా పేరుగాంచిన ధావన్ గురువారం తన గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేస్తూ ఆమెతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. “మై లవ్” అంటూ హార్ట్ ఎమోజీతో పెట్టిన ఆ పోస్ట్‌తో తమ మధ్య రిలేషన్‌కు అధికారిక ముద్ర వేసాడు. గత కొంతకాలంగా వీరి మధ్య ప్రేమ ఉందన్న వార్తలపై ఈ పోస్ట్‌తో క్లారిటీ వచ్చింది.
ఆమె పేరు సోఫీ షైన్. ఐర్లాండ్‌కు చెందిన ఈ అందగత్తె మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తిచేసి ప్రొడక్ట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం అబుదాబీలోని నార్తరన్ ట్రస్ట్ కోఆపరేషన్ సంస్థలో ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇటీవల దుబాయిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో ఈ జంట కలిసి కనిపించడంతో వారి రిలేషన్‌పై పుకార్లు మొదలయ్యాయి. ఇప్పుడు ధావన్ స్వయంగా ప్రకటించడంతో ఆ వార్తలు నిజమైపోయాయి.
శిఖర్ ధావన్ 2023లో తన భార్య అయేషా ముఖర్జీతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. 11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన అనంతరం గబ్బర్ ఒంటరిగా జీవిస్తున్నాడు. సోఫీ షైన్‌తో ప్రేమలో పడ్డ ఆయన ఇప్పుడు మళ్లీ జీవితాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ధావన్ కొత్త ప్రేమను అభిమానులతో పంచుకుంటూ హ్యాపీగా ఉన్నాడు.
ధావన్ క్రికెట్ కెరీర్ కూడా గొప్పదే. 2010 నుంచి 2022 వరకు టీమిండియాను వివిధ ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహించాడు. 167 వన్డేల్లో 6,793 పరుగులు, 34 టెస్టుల్లో 2,315 పరుగులు, 68 టీ20ల్లో 1,759 పరుగులు చేసి మొత్తం 10వేలకు పైగా అంతర్జాతీయ పరుగులు చేశాడు. గత ఏడాది క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన గబ్బర్ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితం కొత్త మలుపు తిరగడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.