ఇప్పటి తరంలో చాలామంది రోజు టీ తాగడం, అదే సమయంలో సిగరెట్ కాల్చడం అలవాటుగా చేసుకుంటున్నారు. అయితే ఈ అలవాటు అత్యంత ప్రాణాంతకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ తాగుతూ సిగరెట్ కాల్చితే శరీరానికి తీవ్రంగా దెబ్బ తగులుతుందని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఈ అలవాటు వల్ల అధికమవుతుంది. వేడి పానీయాలు వల్ల శరీర భాగాలు నాజూకుగా మారుతాయి, అటువంటి సమయంలో నికోటిన్, టార్కు కలసిన పొగ శరీరాన్ని తీవ్రమైన రీతిలో నాశనం చేస్తుంది. ముఖ్యంగా పురుషులలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
పురుషుల్లో శుక్రకణాల నాణ్యత తగ్గిపోవడం, ఫెర్టిలిటీ సమస్యలు రావడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. అంతేకాక గుండె సంబంధిత సమస్యలు, గుండెపోటుకు దారితీసే పరిస్థితులు ఏర్పడతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రెండు పదార్థాల కలయిక శరీరంలో విషాలను పెంచుతుందట.
ఈ అలవాటు మానుకోకపోతే “వీసా లేకుండానే పై లోకానికి టికెట్ ఖాయం” అని నిపుణులు ఉచితంగా హెచ్చరిస్తున్నారు. అందుకే రోజూ ఆ హాబిట్ ను అలవాటు చేసుకుంటూ ఉండడం కంటే, ఇప్పుడే ఆ అలవాట్లను వదిలేయడం మన ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని వారు సూచిస్తున్నారు. టీ తాగాలంటే కూడా మితంగా, ఆరోగ్యంగా తాగాలని స్పష్టం చేస్తున్నారు.