చాలా కాలంగా విజయాన్ని తహతహలాడిన విక్రమ్‌కు వీరధీరశూరన్ సినిమా ఓ ఊరటగా నిలిచింది. మార్చి 27న విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లోనూ పాజిటివ్ టాక్‌తో ముందుకెళ్లింది. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుషారా విజయన్, సూరజ్ వెంజరమూడి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించగా, భావోద్వేగాలు, యాక్షన్‌తో కూడిన కథనం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో విక్రమ్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఒక సాధారణ కిరాణా షాపుదారుడిలా కనిపించే వ్యక్తి గతంలో ఉన్న ఘోరమైన సత్యాలను కథలో ఆసక్తికరంగా చేర్చారు. ముఖ్యంగా విక్రమ్ మరియు దుషారాల మధ్య సన్నివేశాలు సినిమాలో భావోద్వేగ బలాన్ని పెంచాయి. ఈ సినిమా తెలుగులో వసూళ్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, చూసినవారికి మాత్రం మంచి అనుభూతినే మిగిల్చింది.
దుషారా విజయన్ వరుసగా మంచి పాత్రలు దక్కించుకుంటూ తన స్థాయిని పెంచుకుంటోంది. ఆమె విక్రమ్ సరసన నటించే స్థాయికి వచ్చిందంటే, ఆమె ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుల మద్దతుతో ఆమెకు తెలుగులో క్రేజ్ కూడా పెరుగుతోంది. సెకండాఫ్‌లో పిక్ అప్ అయిన కథ, భావోద్వేగ సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలంగా నిలిచాయి.
ఇప్పుడు ఈ చిత్రం ఏప్రిల్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. థియేటర్ లో మిస్ అయినవారు ఇప్పుడు ఓటీటీలో చూసే అవకాశం పొందనున్నారు. కుటుంబంతో కలిసి ఆస్వాదించదగిన ఈ సినిమాను మిస్ చేయకుండా చూడమంటున్నారు మూవీ లవర్స్.