సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయ పరిధిలో గల నాలుగు కాళ్ల మండపంలో డోలా పూర్ణిమ నాడు డోలోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి మహిమను స్మరిస్తూ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు. ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
డోలోత్సవాన్ని గత 50 సంవత్సరాలుగా దూశనపూడి గ్రామానికి చెందిన చేన్ను సాంభశివరావు కుటుంబ సభ్యుల సహకారంతో నిర్వహిస్తున్నారు. నరసింహుని కుమారుడు పరమేశుని మూడవ నేత్రంతో భస్మమైన తర్వాత రెండవ రోజున ఈ మండపంలో ప్రత్యేక పూజలు, వేద పారాయణం నిర్వహించటం ఆనవాయితీగా కొనసాగుతోంది.
ఈ ఏడాది కూడా భక్తుల సమక్షంలో విశేషంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రంగాచార్యులు, పి. పుల్లయాచార్యులు, సీతారామ్ ప్రత్యేకంగా హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తమ మనోకామనలను తీర్చుకోవాలని ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పరివేక్షకులు విజయసారది, శ్రీను, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయం శోభాయమానంగా అలంకరించబడింది. భక్తులు స్వామివారికి విశేష సేవలు సమర్పిస్తూ భక్తి భావంతో ఉత్సవాన్ని వీక్షించారు.