జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు CHC (కమ్యూనిటీ హెల్త్ సెంటర్) ను శుక్రవారం సందర్శించారు. అక్కడ తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు వారు డాక్టర్ సౌమ్యతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. జనసేన నాయకుల జోక్యంతో సమస్య పరిష్కార దిశగా సాగింది.
సమస్య పరిష్కారంలో భాగంగా, వరుపుల తమ్మయ్య బాబు డాక్టర్ శ్వేతకు నేరుగా అపాలజీ చెప్పారు. ఇది సానుకూలంగా మారి, ఆసుపత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. సంతృప్తికరంగా చర్చలు ముగియడంతో, జనసేన నాయకులు హాస్పిటల్ సిబ్బందికి తమ మద్దతును తెలియజేశారు.
తుమ్మల బాబు మాట్లాడుతూ, ప్రజాసమస్యలు ఎక్కడున్నా జనసేన పార్టీ స్పందిస్తుందని, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలను సమీక్షించి అవసరమైన ఒత్తిడిని తీసుకువస్తామని చెప్పారు. వైద్య సేవలు అందరికీ నిరంతరాయంగా అందాల్సిందేనని, ఈ వ్యవహారంపై మరో సమస్య తలెత్తకుండా చూసేందుకు తమవంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ పరిణామంతో ప్రత్తిపాడు CHC లో కొనసాగుతున్న సమస్యలు సద్దుమణిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. జనసేన నేతల చొరవతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడం అందరికీ ఉపశమనంగా మారింది. హాస్పిటల్ నిత్యం ప్రజలకు సేవలందించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు తెలిపారు.