ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుస విజయాలతో సెమీఫైనల్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లపై గెలిచిన టీమిండియా, లీగ్ దశలో చివరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. అయితే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ విశ్రాంతి తీసుకునే అవకాశముందని ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది. భారత జట్టు బుధవారం నుంచి ప్రాక్టీస్ ప్రారంభించినా, రోహిత్ మాత్రం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం జాగింగ్, ఫిజియో థెరపీ మాత్రమే చేశాడని సమాచారం. సెమీఫైనల్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని భావిస్తోంది.
రోహిత్ విశ్రాంతి తీసుకుంటే, అతని స్థానంలో రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. బుధవారం నెట్స్‌లో ఈ ఇద్దరూ బౌలర్లను ఎదుర్కొంటూ తీవ్రంగా ప్రాక్టీస్ చేసినట్లు సమాచారం. అలాగే శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించేది ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొంది. కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
మార్చి 4న భారత్ సెమీఫైనల్ ఆడనుండటంతో, రోహిత్ పూర్తిగా కోలుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని జట్టు వర్గాలు వెల్లడించాయి. న్యూజిలాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆడే తీరుపై అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.