రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మధ్యాహ్నం తిరుత్తణి అరుల్మిగు మురుగన్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికారు. ఆయనకు పురోహితులు పూర్ణకుంభంతో సత్కారం అందజేశారు.
శ్రీ వల్లీ దేవసేనా సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పవన్ కళ్యాణ్ కుటుంబానికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ ఆలయ మహత్యాన్ని వివరంగా తెలుసుకున్నారు.
తిరుత్తణి మురుగన్ ఆలయ దర్శనంతో పవన్ కళ్యాణ్ షష్ట సుబ్రహ్మణ్య క్షేత్ర యాత్ర పరిపూర్ణమైంది. ఈ యాత్రలో భాగంగా ఆయన తమిళనాడు లోని ఆరుగురు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. పవన్ ఆధ్యాత్మిక ప్రయాణానికి అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ దర్శనానికి పవన్ కుమారుడు అకీరా నందన్, టీటీడీ బోర్డు సభ్యులు ఆనంద్ సాయి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ప్రసాదాలను అందించారు. పవన్ ఆలయం నుండి బయటకు వచ్చిన వెంటనే అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆయనను కలుసుకున్నారు.