రామగుండం నియోజకవర్గం 29 డివిజన్ మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో ఈ వేడుకలను కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్టిపిసి టౌన్ అధ్యక్షుడు ఆసిఫ్ పాషా మహంకాళి స్వామికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మరింత పై స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి స్వామిని ఘనంగా సత్కరించారు.
జిల్లా యువజన కాంగ్రెస్ నేతలు ముచ్చకుర్తి రమేష్, కంది ఆంజనేయులు, కత్తెర మల్లె రమేష్, భరత్ గౌడ్, మురళి, లంబు కిషన్ రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. స్థానిక నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై స్వామికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బాబా, ఎన్టిపిసి పట్టణ ఉపాధ్యక్షులు వాసు, ఇలియాస్, కాంగ్రెస్ యువజన నాయకులు జులఅవినాష్, సురేష్, మనీ, హరి, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలు సందడిగా కొనసాగాయి.