భాష్యం విద్యాసంస్థలు మరోసారి అఖండ విజయాన్ని సాధించి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిని గడించాయి. ఎన్టీఏ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్షలో 14 లక్షల మందికి పైగా విద్యార్థులు పోటీ పడగా, భాష్యం విద్యార్థులలో 14 మంది 100% స్కోర్ సాధించడం గర్వించదగిన విషయంగా నిలిచింది. వీరిలో సాయి మనోజ్ఞ గుత్తికొండ దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకు సాధించడం రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమని భాష్యం చైర్మన్ రామకృష్ణ వ్యాఖ్యానించారు.
భాష్యం సీఈవో బెల్లంకొండ అనిల్ కుమార్ మాట్లాడుతూ “విన్నర్స్ వరల్డ్ భాష్యం విద్యాసంస్థలకే సొంతం” అని గర్వంగా ప్రకటించారు. ఆదోని భాష్యం బ్రాంచ్ విద్యార్థి జయదీప్ 99.7% స్కోర్ సాధించగా, మరో విద్యార్థి సులీక్ 90% సాధించడం హర్షణీయమని ప్రిన్సిపాల్ సురేంద్రబాబు తెలిపారు. విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని ఆదోని పట్టణంలో గ్రాండ్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఈ విజయ ర్యాలీ భాష్యం బ్రాంచ్ నుంచి ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్, బీమా సర్కిల్, రైల్వే సర్కిల్ మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ హనుమంతరావు, సీఈఓ అనిల్ కుమార్, హెచ్ఎం శిరీష, వైస్ ప్రిన్సిపల్ భార్గవ్ పవన్, పీఈటీలు పవిత్ర, శంకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. భాష్యం విద్యార్థులు సాధించిన ఘనతను తెలుగురాష్ట్రాల్లో చాటిచెప్పేలా విజయోత్సవ ర్యాలీ కొనసాగింది.
భాష్యం విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని, రూట్స్ మీద కాన్సంట్రేషన్ లెవెల్స్ పెంచేందుకు వినూత్నమైన మార్గదర్శకాలు అందిస్తున్నాయని ప్రిన్సిపాల్ సురేంద్రబాబు తెలిపారు. భాష్యం విద్యార్థులు సాధించిన ఈ అద్భుత విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని చెబుతున్నారు.