కొత్త ₹50 నోటు విడుదలకు ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్

RBI announced the release of a new ₹50 note under the Mahatma Gandhi series, featuring Governor Sanjay Malhotra's signature. RBI announced the release of a new ₹50 note under the Mahatma Gandhi series, featuring Governor Sanjay Malhotra's signature.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ₹50 నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన ఈ నోటు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో భాగంగా ఉండనుంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ₹50 నోట్ల చెలామణి కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. పాత నోట్లను వెనక్కి తీసుకునే ఉద్దేశ్యం లేదని కూడా వివరించింది.

గతేడాది డిసెంబర్‌లో ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో తొలి కీలక ప్రకటనగా ఈ కొత్త నోటు విడుదల మార్గదర్శకంగా నిలుస్తుంది. కొత్తగా ముద్రించబోయే నోటుపై ఆయన సంతకం ఉంటుంది. దీనికి సంబంధించిన డిజైన్, భద్రతా లక్షణాలు మార్చడం జరుగుతుందని, అయితే మహాత్మా గాంధీ సిరీస్‌లో భాగంగానే ఇది ఉండనుందని ఆర్బీఐ తెలిపింది.

కొత్త ₹50 నోటు ఫ్లోరసెంట్ నీలం రంగులో రూపుదిద్దుకోనుంది. నోటు వెనుక భాగంలో హంపిలోని రథం చిత్రంతో భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది. కొత్త నోటు పరిమాణం 66 మి.మీ x 135 మి.మీగా ఉండనుందని సమాచారం.

సమాజమాధ్యమాల్లో వస్తున్న పుకార్లకు ముగింపు పలుకుతూ, ప్రస్తుతం ఉన్న ₹50 నోట్లు చెలామణి అవుతూనే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, కొత్త నోటు విడుదలతో పాటు లావాదేవీలు సులభతరం అవుతాయని బ్యాంక్ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *