అగ్రరాజ్యం అమెరికా భారత్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర పన్నిందని మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. జో బైడెన్ హయాంలో ఈ కుట్ర జరిగిందని, భారత్‌తో పాటు మరికొన్ని దేశాలను అస్థిరం చేయడమే లక్ష్యంగా నిధులను దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ మేరకు ట్రంప్ తన X (ట్విట్టర్) అకౌంట్ ద్వారా ప్రకటన చేశారు.
USAID ద్వారా పేద దేశాలకు మద్దతుగా ఇచ్చే నిధులను రాజకీయ ఎజెండా కోసం వాడుకున్నారని ట్రంప్ ఆరోపించారు. శ్రీలంక, బంగ్లాదేశ్, ఉక్రెయిన్, సిరియా, ఇరాన్, పాకిస్తాన్, ఇండియా, యూకే సహా అనేక దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు ఈ నిధులను వినియోగించారని పేర్కొన్నారు. అమెరికన్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌కు 260 మిలియన్ డాలర్ల USAID నిధులను అందించారని వెల్లడించారు.
బైడెన్ పాలనలో ఈ కుట్ర నడిచిందని ధృవీకరించిన ట్రంప్, తాను అధికారంలోకి రాగానే USAID నిధుల తీరుపై విచారణ ప్రారంభించానన్నారు. విదేశాల్లో అస్థిరత సృష్టించేలా నిధుల ఉపయోగంపై నియంత్రణ విధించానని చెప్పారు. బైడెన్ హయాంలో నిధులను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
ఈ ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా భారత్‌కు మిత్ర దేశమైనప్పటికీ, ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బైడెన్ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.