విశాఖపట్నం గోపాలపట్నం పార్టీ కార్యాలయంలో టీడీపీకి భారీ చేరిక జరిగింది. వైసీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ అయితంశెట్టి సత్యవతి, నాయకులు అయతంశెట్టి కోటేశ్వరరావు, అయతంశెట్టి గోపీ, అనుచరులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ప్రభుత్వ విప్ మరియు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు సమక్షంలో చేరిక జరిగింది.
ఈ సందర్భంగా గణబాబు గారు కొత్తగా చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజాసేవకు కట్టుబడి పని చేస్తుందని, ప్రజలకు మేలు చేసే పాలన అందిస్తామని పేర్కొన్నారు. కొత్తగా చేరిన నేతలు పార్టీ బలోపేతానికి సహకరించాలని సూచించారు.
మాజీ కార్పొరేటర్ సత్యవతి మాట్లాడుతూ తమ నియోజకవర్గ ప్రజలకు మంచినే చేయాలనే లక్ష్యంతో టీడీపీలో చేరినట్లు తెలిపారు. కోటేశ్వరరావు, గోపీ సహా అనేకమంది టీడీపీ పరిపాలన పట్ల నమ్మకంతో పార్టీకి మద్దతుగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్టీలోని స్థానిక నేతలు, కార్యకర్తలు వారికి సంపూర్ణ మద్దతు అందించారు.
గోపాలపట్నంలో జరిగిన ఈ చేరికతో టీడీపీకి మరింత బలం చేకూరిందని నేతలు అభిప్రాయపడ్డారు. స్థానికంగా పార్టీ బలోపేతానికి ఇది మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. అనంతరం నాయకులు పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
