1970లో శ్రీహరికోట రాకెట్ కేంద్రం కోసం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, అక్కడ నివసిస్తున్న సుమారు 16 కాలనీ లను ఖాళీ చేయాలని నిర్ణయించబడింది. ఉమ్మడి నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటిని నివాస స్థలాలు మరియు సాగుబారిన భూములుగా పంపిణీ చేయడం జరిగింది. శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసులకు 10 సెంట్లు స్థలం మరియు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగిందని అధికారులు ప్రకటించారు.
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో, 307 సర్వే నంబరులో ఉన్న 306 ప్లాట్లను శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసులకు ఇచ్చారు. అయితే, ఈ స్థలాలపై అక్కరపాక గ్రామస్తులు అభ్యంతరాలు వ్యక్తం చేసి, అక్కడ గృహ నిర్మాణం ప్రారంభించేందుకు వచ్చిన కాలనీ నివాసులను అడ్డుకున్నారు. వారు రాళ్లను నాటడం, పగులగొట్టి, “మీకు ఇక్కడ స్థలం లేదు” అంటూ దుర్భాషలాడారు.
బాధితులు ఈ విషయాన్ని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చంద్రశేఖర్ మరియు సిఐటియు మండల కార్యదర్శి లక్ష్మయ్యకు తెలియజేశారు. వారు మాట్లాడుతూ, “ఈ స్థలాలను కేంద్ర ప్రభుత్వ చొరవతో దొరికినవిగా, తహసిల్దార్ ద్వారా హక్కు ఇచ్చినవిగా గుర్తించారు. కానీ, కొందరు దొంగ పట్టాలు సృష్టించి, ఇతరులకు అమ్ముతున్నట్లు కనుగొనడం జరిగింది” అని పేర్కొన్నారు.
అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, బాధితులు రెవెన్యూ అధికారుల నుంచి నాయ్యాన్ని ఆశించారు. “మాకు ఇవ్వబడిన హక్కులను కాపాడుకోవాలని, ఇక్కడ గృహాలు నిర్మించుకునేందుకు సహకారం కావాలని” వారు కోరారు.