పుణేలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో గాయపడ్డ శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు.
ఇదే అతనికి భారత తరఫున తొలి టీ20 మ్యాచ్. అరంగేట్రంలోనే అతను 3 వికెట్లు తీసి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఈ కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిబంధన ప్రకారం, కంకషన్‌కు గురైన ఆటగాడి స్థానంలో అలాంటి ఆటగాడినే తీసుకోవాలి.
చివరికి ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. “హర్షిత్ ఎందుకు ఫీల్డింగ్‌లో ఉన్నాడు?” అని అడిగినప్పుడు, అతనికి కంకషన్ సబ్‌స్టిట్యూట్ అని సమాధానమిచ్చారు. ఈ విషయం పై బట్లర్ జవగళ్ శ్రీనాథ్ నుంచి క్లారిటీ అడిగేందుకు మునుపటి చర్యలు తీసుకుంటానని చెప్పాడు.
ఐసీసీ రూల్స్ ప్రకారం, కంకషన్ సబ్‌స్టిట్యూట్‌కు స్పెసిఫిక్ నిబంధనలు ఉన్నాయ్. బ్యాటర్ స్థానంలో బ్యాటర్ లేదా బౌలర్ స్థానంలో బౌలర్ మాత్రమే ఉండాలి. అయితే, పేస్ బౌలర్‌గా హర్షిత్ రాణా వచ్చి వివాదానికి కారణమయ్యాడు.