కడప జిల్లా పొద్దుటూరు పురపాలక పరిధిలో జాతీయ రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు రహదారి భద్రతపై వివరించారు. డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బైక్ మరియు స్కూటీపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించకుండా సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. ప్రజలు క్షేమంగా ఇంటికి చేరేలా రవాణా నియమాలను పాటించాలనే ఉద్దేశంతో పొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారులపై సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, ప్రజలకు ట్రాఫిక్ నియమాలను వివరించారు.
ఈ ర్యాలీలో పోలీస్ డివిజన్ శాఖ, రవాణా శాఖ, ప్రొద్దుటూరు డీఎస్పీ, ఆర్టీవో, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. ప్రజల రహదారి భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, అనుసరించాల్సిన ముఖ్యమైన నిబంధనలను వివరించారు.
అందరి సహకారంతోనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు పేర్కొన్నారు. హెల్మెట్ తప్పనిసరి అనే విషయాన్ని ప్రజలు గుండెతో గుర్తుంచుకోవాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.