తురువోలు లో జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహణ

Grand National Girl Child Day Celebrations in Turuvolu Grand National Girl Child Day Celebrations in Turuvolu

అనకాపల్లి జిల్లా వి. నియోజకవర్గం చీడికాడ మండలం తురువోలు గ్రామంలో జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ వేడుకలకు ఐసీడీఎస్ పీవో శ్రీదేవి ముఖ్య అతిథిగా హాజరై, బాలికల హక్కులపై మాట్లాడుతూ బాల్యవివాహాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థినులతో పాటు అంగన్వాడి సిబ్బంది బాల్యవివాహాలను నిరోధించాలని ప్రతిజ్ఞ చేశారు.

గ్రామంలో అవగాహన పెంచేలా విద్యార్థినులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా పోలీస్ గొట్టివాడ సుజాత, అంగన్వాడి సూపర్వైజర్ రమణి, ఏఎన్‌ఎమ్ పద్మ, ఎంఎల్‌హెచ్‌పి గోవిందమ్మ పాల్గొన్నారు.

అంగన్వాడి టీచర్లు, హైస్కూల్ టీచర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు కలిసి బాలికల భవిష్యత్తు కోసం పని చేయాలని నిర్ణయించారు. బాలికల హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అందరూ ప్రతిజ్ఞ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *