కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద తుంబలం సమీపంలో మంత్రాలయం రోడ్డుపై బస్సు ప్రమాదం జరిగింది. మైసూరు నుంచి వచ్చిన భక్తులు మంత్రాలయం వెళ్లేందుకు బయలుదేరగా, రాత్రి వారి ప్రయాణం విషాదంగా మారింది.
KA 14A9609 నంబర్ గల మెనీ టూరిస్ట్ బస్సు మంత్రాలయం సన్నిధికి 30 కిలోమీటర్ల దూరంలో చెట్టుకు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.
ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం అతనిని 108 అంబులెన్స్ ద్వారా ఆదోని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన ఇతర భక్తులకు కూడా వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రమాద ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. బస్సు వేగం కారణమా? లేదా డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికులు స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేశారు.