నెల్లూరు సిటీలోని సండే మార్కెట్ వద్ద నోవా బ్లడ్ బ్యాంక్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్‌సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. రక్తదానంతో అనేకమందికి ప్రాణదానం చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.ఎస్ షిండే 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా 2000 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని నెల్లూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ వెల్లడించారు. రెండు లక్షల మంది రక్తదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
ఈ రక్తదాన శిబిరంలో డిస్టిక్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దుగ్గిశెట్టి అశోక్, వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్, సెక్రటరీ శ్రీకాంత్, రాయల్ మెడికల్స్ జహీర్, రవి, నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ భావిశెట్టి వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, దీనికి ప్రజలు పెద్దఎత్తున స్పందించాలని వారు కోరారు.
కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటువంటి రక్తదాన శిబిరాలు పలు ప్రాంతాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైనవారికి రక్తం అందించేందుకు తమ సంఘం నిరంతరం కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు.