నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఆశయాలు తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకంగా ఉంటాయని, ఆయన చూపిన మార్గంలో పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ స్పూర్తితో కోటిమంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, తెలుగుజాతి గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు.
ఏ ఆశయాలతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారో, వాటిని నెరవేర్చడమే తమ లక్ష్యమని నారా లోకేష్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే తమ ధ్యేయమని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పార్టీ నిరంతరం పనిచేస్తుందని చెప్పారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల ఆశీర్వాదంతో మరింత బలంగా ఎదగాలని, రాష్ట్ర అభివృద్ధికి పార్టీ శ్రమించాల్సిన బాధ్యత ఉందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.