హైదరాబాదులోని సుజనా చౌదరి గారి కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజానా చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు. ఈ భేటీలో రెండు నేతలు అనేక అంశాలపై చర్చించుకున్నారు, ముఖ్యంగా అనంతపురం అభివృద్ధి గురించి.
అనంతపురం జిల్లా అభివృద్ధిపై ఆరా తీసిన ఎమ్మెల్యే సుజానా చౌదరి గారు, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులు, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర సాయంతో చేయనున్న పనుల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ముఖ్యంగా, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ప్రగతిపై వివరాలు అడిగిన సుజానా చౌదరి గారు, అనంతపురం అర్బన్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుండి మరిన్ని నిధులు మంజూరు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇకపోతే, కూటమి పార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలని, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై మరిన్ని ప్రణాళికలు చేపట్టాలని స్పష్టీకరించారు.
