తెలంగాణ పోలీస్ లోగోలో మార్పు, కొత్త చిహ్నం ఆవిష్కరణ

Chief Minister Revanth Reddy has taken significant decisions after Congress came to power. Telangana Police unveils a new logo by removing the word "State" from its official emblem. Chief Minister Revanth Reddy has taken significant decisions after Congress came to power. Telangana Police unveils a new logo by removing the word "State" from its official emblem.

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి, తొలిసారిగా అధికారం సాధించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు.

గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆ మాటల్లో, చివరకు రాష్ట్ర పేరును కూడా మార్చే నిర్ణయం తీసుకున్నారని ఆయన ఫైర్ అయ్యారు.

ఈ దిశగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ఆలోచనలో భాగంగా తెలంగాణ పోలీస్ కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ లోగోను పోలీస్ శాఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. తెలంగాణలో గతంలో ఉన్న అధికారిక పేర్లలో మార్పులు చేస్తూ, టీఎస్ (TS) అనే పదాన్ని తొలగించి టీజీ (TG) అనే కొత్త పేరును తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *