ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ నాయకత్వం వహించారు.
కాశివాని తూము సెంటర్ నుండి విద్యుత్ సబ్ స్టేషన్ వరకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సమయంలో కార్యకర్తలు “చంద్రబాబు డౌన్ డౌన్,” “విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వం గమనించాలని ర్యాలీ ద్వారా తెలియజేశారు. భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ర్యాలీ అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ లో అధికారులను కలసి వినతి పత్రం సమర్పించారు. ప్రజా సంక్షేమం కోసం వీరి నిరసన కొనసాగుతుందని నాయకులు ప్రకటించారు.