భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను పదవి నుండి భర్తరఫ్ చేయాలని అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లాయర్లు నిరసన చేపట్టారు.
లాయర్లు అమిత్ షా పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని, వెంటనే ఆయనను హోం మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇది చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
లాయర్లు మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి అమిత్ షాను పదవి నుండి తొలగించి, దేశ ప్రజల న్యాయపరమైన హక్కులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయి రామ్, సెక్రటరీ నందిక శ్రీను, డి.బి. లోక్, పెయ్యల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లాయర్లు అధిక సంఖ్యలో హాజరై తమ నిరసనను వ్యక్తపరిచారు.