ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సూచనల మేరకు, కోవూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం వద్ద జరిగింది.
కోవూరు మండల వైఎస్ఆర్సిపి యువజన విభాగ అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్ రెడ్డి, డి ఏ ఏ బి మాజీ చైర్మన్ దోడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా, సాయిబాబా మందిరంలో జగన్ మోహన్ రెడ్డి మరల ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ నలుబోలు సుబ్బారెడ్డి, జడ్పిటిసి కవగిరి శ్రీలత, ఉప ఎంపీపీ శివుని నరసింహాలురెడ్డి, ఏసీ మాజీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, ఎంపీటీసీ వేణు, సర్పంచ్ లక్ష్మి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.