అమెరికా నుంచి భారతీయులకు కొత్త ఉద్యోగ అవకాశాలు

The US government has eased visa rules for foreign professionals, allowing Indian workers better opportunities through H-1B visas and changes to F-1 student visas. The US government has eased visa rules for foreign professionals, allowing Indian workers better opportunities through H-1B visas and changes to F-1 student visas.

అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయుల కోసం జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇప్పుడు విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అమెరికా కంపెనీలకు కల్పిస్తూ కీలకమైన నిబంధనలలో మార్పులు చేసింది. ఈ మార్పుల ద్వారా భారతీయ ప్రొఫెషనల్స్‌కు మంచి అవకాశాలు ఏర్పడతాయని భావిస్తున్నారు.

ప్రస్తుతం, అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా ద్వారా విదేశీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ఈ వీసా ద్వారా ప్రధానంగా భారత్, చైనా దేశాలు లబ్ధి పొందుతుండగా, తాజాగా మార్పుల కారణంగా ఈ విధానం మరింత సులభంగా మారింది. జాబితాలో ఉన్న నిపుణుల కోసం ఉద్యోగ సంస్థలకు అవకాశాలను పెంచడం జరిగిందని అధికారులు తెలిపారు.

ఈ మార్పుల ప్రకారం, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు కూడా హెచ్-1బీ వీసాలుగా మారిపోయే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో విదేశీ విద్యార్థులు ఆప్తమైన విధంగా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధనలను అమలు చేయాలని హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ప్రకటించారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ ఈ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశాన్ని కంపెనీలకు కల్పించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *