కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ చేయించిన షిప్‌లో బుధవారం మల్టీ డిసిప్లీనరీ కమిటీ సభ్యులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రేషన్ బియ్యం నమూనాలను సేకరించారు. బియ్యం ఏ గోదాం నుంచి షిప్‌లోకి చేరింది, ఎంత మొత్తంలో ఉంది అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
తనిఖీల అనంతరం సేకరించిన వివరాలను నివేదిక రూపంలో కాకినాడ జిల్లా కలెక్టర్‌కు అందజేయనున్నారు. బియ్యం తరలింపులో ఉన్న షిప్ వివరాలు, గోదాం నుండి సరఫరా చేసిన మార్గం వంటి అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇటీవలే రేషన్ బియ్యం అక్రమంగా షిప్ ద్వారా తరలింపు కలకలం సృష్టించడంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్యలు తీసుకోవడం హైలైట్‌గా మారింది.
బియ్యం తరలింపు వెనుక ఉన్న నకిలీ ధృవపత్రాలు, ఇతర అంశాలపై దర్యాప్తు చేపట్టడం కీలకమని అధికారులు తెలిపారు. ఈ చర్యలతో రాష్ట్రంలో రేషన్ అక్రమ దందాలను అడ్డుకోవాలని ప్రభుత్వం పట్టుబడుతోంది.