నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ సౌజన్య సూచనలతో రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసి తప్పించుకుంటున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించి, కొడవలూరు మండలం పద్మనాభ సత్రం వద్ద అదుపులోకి తీసుకున్నారు.
అల్లూరికి చెందిన ఈ నలుగురు దొంగల వద్ద నుండి సుమారు 30 లక్షల విలువైన 56 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా దొంగతనాలు చేసిన ఈ ముఠా, పోలీసుల నిఘా చర్యలతో చివరకు పట్టుబడింది. దొంగతనం చేసిన బైక్‌లను తక్కువ ధరకు విక్రయించే యత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన పోలీసుల కృషిని డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు ప్రశంసించారు. ప్రజలు తమ మోటార్ సైకిళ్లకు సంబంధించి పోలీసులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను అసలు యజమానులకు అప్పగించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. పోలీసులు దొంగతనాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడే ముఠాలను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని పేర్కొన్నారు.