గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్‌లో పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల ఉపాధి అవకాశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపూర్‌కు చెందిన ఈస్ట్‌మన్ ఎక్స్‌పోర్ట్స్ గ్లోబల్ క్లాథింగ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్స్‌టైల్ పరిశ్రమను పలమనేరు పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ పరిశ్రమ ద్వారా సుమారు 4,000 మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఐకేపి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ అవకాశాలను రూపొందించినట్టు తెలిపారు. వారి ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే అన్నారు.
ఈ సమావేశానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, DRDA పీడీ శ్రీదేవి, ఈస్ట్‌మన్ సీఈఓ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ మొయిద్దీన్, డీఐసీ ఏడీ వెంకటరెడ్డి, ఏపీఐఐసీ మేనేజర్ ఇస్మాయిల్ హాజరయ్యారు. ప్రభుత్వ అధికారులు, టెక్స్‌టైల్ కంపెనీ ప్రతినిధులు కలిసి మహిళలతో ప్రత్యక్షంగా సంభాషించారు.
పలమనేరు మున్సిపల్ కమిషనర్ రమణ రెడ్డి, టీడీపీ నాయకులు సోమశేఖర్ గౌడ్, నాగరాజు రెడ్డి, పలువురు ఏపీఎంలు, డీపీఎంలు, సీసీలు, సంఘ మిత్రలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.