22వ వార్డు విజయభాస్కరరెడ్డి కాలనీకి చెందిన 200 కుటుంబాలు మున్సిపల్ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అభివృద్ధి ఆకర్షితులై, ప్రజలు తనపై నమ్మకంతో పార్టీలో చేరడంపై ఆనందం వ్యక్తం చేశారు.
పార్థసారథి గారు పేద ప్రజల కష్టాల్లో, సుఖాల్లో పాలుపంచుకుంటూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన బీజేపీ పార్టీకి చేరిన అందరికీ హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కౌన్సిలర్ లలితమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీకి చేరిన వారందరికీ ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఎన్ని కుట్రలు జరిగినా, ప్రజల సేవలో బీజేపీకి అంకితమవుతానని హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతానికి తగిన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ, కార్యదర్శి ఉపేంద్ర, సీనియర్ నాయకులు సింహం నాగేంద్ర, మరియు కౌన్సిలర్లు ఎవి సురేష్, చిన్న, వాసీం, సురేష్, కిట్టు, రంగస్వామి, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.