కర్నూల్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ వారి ఆదేశాల మేరకు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణా రెడ్డి మరియు ఎమ్మిగనూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ మద్యం ధ్వంస కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రోలర్ ద్వారా ఈ మద్యం ధ్వంసం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధి, ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ పరిధి, పెద్ద కడుబూరు స్టేషన్ పరిధిలో నమోదైన 80 ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన 1506 లీటర్ల మద్యం, 01 నాటు సారా కేసులో పట్టుబడిన 10 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ అక్రమ మద్యం విలువ సుమారు ఏడు లక్షల రూపాయలుగా ఉంటుందని తెలిపారు. ఎక్సైజ్ అధికారులు ఈ కార్యక్రమంలో నిష్ఠతో పనిచేయడం వల్ల అక్రమ మద్యం వ్యాపారులకు గట్టి హెచ్చరికగా ఉందని పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలతో అక్రమ మద్యం ఉత్పత్తి, సరఫరాను పూర్తిగా తగ్గించడమే తమ లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతో మద్యం నేరాలను అరికట్టడానికి ముమ్మరంగా పని చేస్తామని అన్నారు.