హైదరాబాద్: సోషల్ మీడియా మోసాలపై సైబర్ పోలీసులు బిగ్ బ్రేక్ అందించారు.సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి భారీ విజయం సాధించారు.
పెట్టుబడులు, ఫోన్ కాల్స్, ఫేక్ యాప్‌లు, మెసేజ్ లింకుల ద్వారా అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
అక్టోబర్ నెలలో సైబర్ మోసాలకు సంబంధించిన 196 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో ప్రమేయం ఉన్న 55 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుల వద్ద నుంచి రూ.107 కోట్లను రికవరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాక, మోసపోయిన బాధితులకు ఇప్పటివరకు రూ.66 లక్షల రూపాయలను తిరిగి అందజేశారు.
ALSO READ:కర్నూలు బస్సు దుర్ఘటనలో కొత్త మలుపు – యజమాని పూచీకత్తుపై విడుదల
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరెస్ట్ చేసిన 55 మంది నిందితులపై దేశవ్యాప్తంగా 136 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని గుర్తించారు.
నిందితుల వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలు డిజిటల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ పోలీసుల ఈ చర్యతో ప్రజల్లో చైతన్యం పెరుగుతోందని, సైబర్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
