సాక్షి ఆఫీస్ వద్ద ఫైర్ డ్రామా!
పక్క ఫర్నిచర్ షాపులో మంటలు పోలీసుల క్లారిటీ
ఏలూరు జిల్లాలోని ‘సాక్షి’ మీడియా కార్యాలయం వద్ద భారీగా మంటలు అంటుకున్నాయి. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది.సాక్షి కార్యాలయానికి సమీపంలో ఉన్న ఓ ఫర్నిచర్ షాపులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.దీనివల్ల జనం మధ్య మంటలు సాక్షి ఆఫీసులోనే అంటుకున్నాయన్న అపోహ ఏర్పడింది. ఆకస్మిక మంటలతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.సాక్షి ఆఫీసుకు ఏమీ జరగలేదని, మంటలు కేవలం పక్కనే ఉన్న ఫర్నిచర్ షాపులోనే జరిగాయి అని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ప్రజలు అపోహపడి అనవసరంగా భయపడకూడదు అని తెలిపారు