అగ్రనటి సమంత తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. దసరా పండుగ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. “కొత్త ప్రయాణం” అంటూ తాను షేర్ చేసిన ఆ ఫోటోలో ‘SAM’ అనే లోగోతో కనిపించే గోడ, ఆమె అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ ఫొటో కొత్త ఇంటికి సంబంధించినదే అని అభిమానులు అంచనా వేస్తున్నారు.
ఇల్లు హైదరాబాద్‌లోనా లేదా ముంబైలోనా అన్నది ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ఫోటో చూస్తే, ఇది ప్రైవేట్ విల్లా తరహాలో ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గోడపై ‘SAM’ అనే లెటర్ లోగో ప్రత్యేకంగా కనిపించడంతో ఇది ఆమె వ్యక్తిగత స్థలం అని స్పష్టమవుతోంది. “కొత్త ప్రయాణం” అనే పదాలతో ఆమె చెప్పినదాని అర్థం ప్రొఫెషనల్ అనా? పర్సనల్ అనా? అన్నదానిపై మాత్రం అభిమానులు మిక్స్‌డ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.
ఇక సమంత రెండో పెళ్లిపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. కొన్ని వారాలుగా బాలీవుడ్‌కి చెందిన దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్లో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ మరియు ‘సిటాడెల్’ లాంటి ప్రాజెక్టుల్లో కలిసి పనిచేయడం, తరచూ ఫంక్షన్లకు జంటగా హాజరవ్వడం ఈ పుకార్లకు బలం చేకూర్చింది. నెట్టింట యూజర్లు ఇప్పుడు ఇదే దిశగా కామెంట్లు చేస్తున్నారు – “ఇది రాజ్‌తో కూడిన కొత్త ప్రయాణమేనా?” అని.
అంతేకాదు, సమంత ప్రస్తుతం సినిమాలపైనా ఫోకస్ పెడుతోంది. ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’, ‘మా ఇంటి బంగారం’ అనే రెండు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్న ఆమె, గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది.
ఈ నేపథ్యంలో కొత్త ఇల్లు + కొత్త ప్రయాణం + పెళ్లి పుకార్లు అన్న మూడు అంశాలు సమంత చుట్టూ విరివిగా చర్చకు మారాయి. ఆమె ఈ ప్రయాణాన్ని పూర్తిగా వ్యక్తిగతంగా చూస్తున్నదా? లేక కొత్త జీవిత భాగస్వామిని స్వాగతించడానికి వేళాయిందా? అన్నది త్వరలోనే తేలనుంది.
