
దేశంలో పెరిగిపోతున్న రైలు ప్రమాదాల నివారణకు రైల్వే బోర్డు కీలక ప్రణాళిక ప్రకటించింది. అన్ని రైళ్లు, కీలకమైన అన్ని రైల్వే యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్టు రైల్వే బోర్డు చైర్‌పర్సన్, సీఈవో జయ వర్మ సిన్హా ప్రకటించారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ రైల్వే జంక్షన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో ఈ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైల్వే ట్రాక్ భద్రత గురించి మాట్లాడారు.
కుంభమేళా నేపథ్యంలో సంఘవిద్రోహుల ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా భద్రతా సంస్థలు రైల్వే ట్రాకులపై నిరంతర నిఘా ఉంచుతాయని సిన్హా హామీ ప్రకటించారు.