కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే ప్రజలకు ఆధార్‌తో అనుసంధానమైన అన్ని పత్రాల వీక్షణ సౌకర్యం కల్పించే ప్రత్యేక వ్యవస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
కుటుంబం యూనిట్‌గా ప్రతి పౌరుడి సమాచారం జియోట్యాగ్ చేయబడిందని, అన్ని శాఖలు ఆ డేటాను వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో ‘డేటా ఆధారిత పాలన’పై నిర్వహించిన సమావేశంలో మంత్రులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై ప్రభుత్వ సేవలు 100% ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రావాలని స్పష్టం చేశారు. “ప్రజలను కార్యాలయాలకు పిలిచే పరిస్థితి ఉండకూడదు. డేటా ఆధారిత పాలనను వెంటనే అమలు చేయాలి.
ASLO READ:రష్యాలో మిస్సింగ్‌గా మారిన భారత విద్యార్థి మృతి… నది ఒడ్డున మృతదేహం వెలికితీనం
తెలియకపోతే నేర్చుకోవాలి కానీ భేషజాలు వద్దు” అని అన్నారు. శాఖల వారీగా జవాబుదారీతనం అవసరమని, ఫలితాలను చూపాల్సింది అధికారులేనని తెలిపారు.
డేటా అనేది సంపద అని, దాన్ని సక్రమంగా వినియోగిస్తే అద్భుత ఫలితాలు సాధ్యమని పేర్కొన్నారు. “వసతిగృహాల్లో తాగునీరు బాగాలేక డయేరియా వస్తే ఎందుకు రియల్‌టైమ్ పర్యవేక్షణ జరగడం లేదు?” అని ప్రశ్నించారు.
డేటాలేక్, డేటా లెన్స్‌లను శాఖలు అనుసంధానం చేసుకోవాలని, ఏఐ ఆధారంగా యూజ్‌కేసులు తయారుచేయాలని ఆదేశించారు.
“ఒక్కరి తప్పు ప్రభుత్వానికే చెడ్డపేరు తెస్తుంది. పారదర్శకతతో పనిచేస్తున్నామని ప్రజల్లో నమ్మకం పెంచాలి” అని సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖల్లో సంతృప్తి స్థాయిని పెంచాలని చెప్పారు.
చివరగా“మనమంతా ఒక బృందం. సాంకేతికతను వినియోగించి సమిష్టిగా పనిచేస్తేనే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
