మాగనూరు గురుకుల పాటశాలలో మంగళవారం ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు తీవ్ర అస్వస్థకు గురైన సంఘటన పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని స్థానిక మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి బుధవారం ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు.
ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు రాత్రి మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్ళి అక్రమ అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డిని నారాయణ పేట జిల్లా పోలీస్టేషన్ కి తరలించారు.
మాజీ ఎమ్మెల్యే అరస్ట్ పట్ల తీవ్ర ఆగ్రహానికి గురైన వారి అభిమానులు పార్టీ నాయకులు ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో పెద్దఎత్తున రాస్తారోకో చేపట్టారు.
దాదాపు గంటలకొద్ది కొనసాగిన ధర్నాతో ట్రాఫిక్ జామ్ సమస్యతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి పోయావి. గాంధి చౌరస్తాకు చేరుకున్న పోలీసు వారు రాస్తారోకో కు ఎటువంటి అనుమతులు లేవని ఇక్కడినుండి వెళ్ళాలని ఎస్ ఐ నరేందర్ కోరగా.
బీఆర్ఎస్ నాయకులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ని విడుదల చేసేంతవరకు ధర్నా విరమించేది లేదని బీష్మించి కుర్చున్నారు. సహనం కోల్పోయిన పోలీసు సిబ్బంది వారిని అరెస్టు చేసి పోలిస్టేషన్ కు తరలించారు…