బద్వేల్ రూల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ దేశంలో సోషలిజం నిర్మించడం కోసమే రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నాడు. 1925 నుండి ఇప్పటివరకు ప్రజా పోరాటాలలో ప్రజల హక్కుల కొరకు ఆర్థిక అసమానతలు రూపుమామిటకు ఎంతో కృషి చేసిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉందని ఆయన ఉద్గాడించాడు. రాబోయే కాలంలో కూడా ప్రజా సమస్యల కోసం అనునిత్యం పోరాటాలు నిర్వహించుటకు అందరూ సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్డమాను వీరశేఖర్ జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, ఏఐవైఎఫ్ ఏరియా నాయకులు బండి అనిల్, పాల్గొన్నారు.
బద్వేల్ రూల్ మండల కమ్యూనిస్టు పార్టీ సమావేశం
