తుని పట్టణంలో నూతన వైసిపి కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడిచిన ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని కూటమి ప్రభుత్వం పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం చేద్దామని అప్పటివరకు సమన్వయంతో మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.